KCR: టీఆర్ఎస్ ఆకట్టుకునే విజయం సాధించింది: అమిత్ షా

  • 88 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్
  • బ్రహ్మాండమైన గెలుపన్న అమిత్ షా
  • ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఘన విజయం సాధించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆకట్టుకునే విజయాన్ని సాధించిందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా  కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు. కాగా, టీఆర్ఎస్ గెలుపుపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఇప్పటికే ట్వీట్ల ద్వారా అభినందనలు తెలిపారు.
KCR
Telangana
Amit Shah
BJP
Twitter

More Telugu News