Mahesh Babu: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మహేశ్ ట్వీట్

  • కేటీఆర్‌కి నా అభినందనలు
  • కచ్చితంగా విజయానికి అర్హులు
  • ప్రజల మనిషిగా ఉండాలి
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. నేటితో కౌంటింగ్‌ కూడా పూర్తయినట్టే. ఈ ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు టీఆర్ఎస్ నేతలకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేస్తున్నారు.

తాజాగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. కేటీఆర్ కచ్చితంగా విజయానికి అర్హులని పేర్కొన్నారు. ‘‘కేటీఆర్‌కి నా అభినందనలు. మీరు కచ్చితంగా ఈ విజయానికి అర్హులు. మీరు ఎప్పటికీ ఇలాగే ప్రజల మనిషిగా ఉండాలి. మీ అందరికి నా శుభాకాంక్షలు’’ అంటూ మహేశ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Mahesh Babu
KTR
Telangana
TRS
Twitter

More Telugu News