TRS: తెలంగాణ భవన్ లో రేపు టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం

  • రేపు ఉదయం 11.30 గంటలకు సమావేశం
  • సమావేశానికి హాజరుకానున్న ఎమ్మెల్యేలు
  • శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకోనున్నఎమ్మెల్యేలు
తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటి వరకు టీఆర్ఎస్ 87 స్థానాల్లో విజయం సాధించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లోనే టీఆర్ఎస్ విజయ బావుటా ఎగురవేసింది. ఈ క్రమంలో రేపు ఉదయం 11.30 గంటలకు టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్ లో జరగనున్న ఈ సమావేశానికి నూతన ఎమ్మెల్యేలు హాజరై టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు. కాగా, మొత్తం 119 స్థానాలకు గాను 116 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. మరో మూడు స్థానాలకు సంబంధించిన ఫలితాలు ఇంకా వెలువడలేదు.
TRS
Telangana bhavan
kcr
Hyderabad

More Telugu News