Harish Rao: నా గెలుపును సిద్ధిపేట ప్రజలకు, కేసీఆర్ కు అంకితం చేస్తున్నా: హరీశ్ రావు

  • సిద్దిపేట ప్రజలకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా
  •  నా గెలుపులో ప్రజల చెమట బిందువులున్నాయి
  • ఊపిరి ఉన్నంత వరకూ సిద్దిపేటకు సేవకుడిగా ఉంటా
సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ నేత హరీశ్ రావు లక్షా ఇరవై వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంపై హరీశ్ రావు స్పందిస్తూ, ఇంత మెజార్టీతో గెలిపించిన సిద్దిపేట ప్రజలకు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని, తన గెలుపులో సిద్దిపేట ప్రజల చెమట బిందువులున్నాయని అన్నారు. ఈ విజయాన్ని సిద్ది పేట ప్రజలకు, కేసీఆర్ కు అంకితం చేస్తున్నానని అన్నారు. ఊపిరి ఉన్నంత వరకూ సిద్దిపేటకు సేవకుడిగా పని చేస్తానని చెప్పిన హరీశ్, నాడు ఉద్యమ సమయంలో..నేడు మెజార్టీలో సిద్దిపేటకు సేవకుడిగా పనిచేస్తానని అన్నారు.
Harish Rao
TRS
kcr

More Telugu News