Telangana: కేసీఆర్ ప్రభంజనంపై స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేశ్!

  • ముఖ్యమంత్రి కేసీఆర్ కు అభినందనలు
  • నాలుగు రాష్ట్రాల విజేతలకు శుభాకాంక్షలు
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత
తెలంగాణ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీఆర్ఎస్ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ తెలంగాణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సీఎం కేసీఆర్ కు మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ గఢ్, మిజోరంలో ప్రజామోదం పొందిన విజేతలకు శుభాకాంక్షలు’ అని లోకేశ్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఎన్నికల్లో 57 స్థానాల్లో ఇప్పటికే టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. మరో 30 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Telangana
TRS
Mahakutami
Telangana Assembly Results
Nara Lokesh
Twitter

More Telugu News