K Kavitha: గడ్డం బాబులను, బ్లేడు బాబులను క్షమించి వదిలేస్తున్నాం: కవిత

  • ప్రజాస్వామ్యంలో ఇదే భయంకరమైన శిక్ష
  • ఇంతకన్నా పెద్ద శిక్ష ఉండబోదు
  • గడ్డాలు పెంచుకోవడం, సన్యాసం తీసుకోవడం వారిష్టం
  • నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత
ఈ ఎన్నికల్లో ప్రజా కూటమి ఓడిపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటామని చెప్పిన వారిని, గెలిస్తేనే గడ్డం తీస్తానని చెప్పిన వారిని క్షమించి వదిలివేస్తున్నామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆమె, వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, ఇక వారి ప్రగల్బాలపై విజ్ఞతను వారికే వదిలివేస్తున్నామని అన్నారు.

ప్రజాస్వామ్యంలో ఇంత భయంకరమైన శిక్షే చాలా పెద్దదని, ప్రజలు విధించిన ఈ శిక్షకన్నా మరో పెద్ద శిక్ష ఉండబోదని చెప్పారు. ఇక గడ్డాలు పెంచుకోవడం, సన్యాసం తీసుకోవడం వారిష్టమేనని, ఇకనైనా వారి మనసు మార్చుకుని రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తే, తదుపరి ఎన్నికల్లోనైనా మెరుగైన ఫలితాలను సాధించుకోవచ్చని సలహా ఇచ్చారు.
K Kavitha
Prajakutami
Telangana
Telangana Assembly Results
Telangana Assembly Election

More Telugu News