TRS: గాంధీభవన్ వైపు కన్నెత్తని కాంగ్రెస్... టీఆర్ఎస్ భవన్ వద్ద సంబురాలు మొదలు!

  • నేతలు లేక వెలవెలబోతున్న కాంగ్రెస్
  • అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ ఆధిక్యం
  • టీఆర్ఎస్ భవన్ వద్ద
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు లేవని తేలడంతో గాంధీభవన్ వెలవెలబోతోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొద్దున్నే గాంధీ భవన్ కు వచ్చి, ఇక్కడి నుంచే ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ, ఆయన రాలేదు. మరోవైపు గాంధీభవన్ కార్యదర్శి కూడా అందుబాటులో లేరు. దీంతో గాంధీభవన్ లోని అన్ని తలుపులు కూడా ఇంకా తెరవని పరిస్థితి.

ఇదే సమయంలో బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. పలువురు పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ భవన్ వద్దకు వచ్చి సందడి చేయడం ప్రారంభించారు. దీంతో టీఆర్ఎస్ భవన్ పరిసరాలు కోలాహలంగా మారగా, ఆ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు
TRS
gandhibhavan
Telangana

More Telugu News