Congress: 24... 20... 18... అంతకంతకూ తగ్గుతున్న కాంగ్రెస్ లీడ్!

షార్ట్స్‌లో చూడండి
ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న కొద్దీ కాంగ్రెస్ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్న స్థానాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తొలుత 24 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు లీడింగ్ లో ఉండగా, ఇప్పుడా సంఖ్య 18కి పడిపోయింది. ఇదే సమయంలో టీఆర్ఎస్ 85 చోట్ల లీడ్ లోకి వెళ్లింది. బీజేపీ 4, ఎంఐఎం 3, ఇతరులు 2 చోట్ల లీడ్ లో ఉన్నారు. పలువురు ప్రముఖ కాంగ్రెస్ నేతలు వెనుకబడివున్నారు.

ప్రజా కూటమి అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థుల జాబితాలో ఉంటారని భావించిన కుందూరు జానారెడ్డి (నాగార్జున సాగర్), మహిళకు అవకాశం వస్తే సీఎం పదవి దక్కుతుందని భావించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి (కోదాడ)లతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, డీకే అరుణ తదితరులు వెనుకబడివున్నారు. కనీసం 7 స్థానాలు గ్యారెంటీగా గెలుస్తుందని భావించిన ఎంఐఎం, ప్రస్తుతం 3 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది.
Go Back to Shorts
Congress
TRS
Telangana
Telangana Election 2018
Telangana Assembly Election
Telangana Assembly Results

More Telugu News