rajani: ఇక సెట్స్ పైకి 'భారతీయుడు 2'

  • ఈ నెల 14వ తేదీన సెట్స్ పైకి 
  • సంగీత దర్శకుడిగా అనిరుథ్ 
  • చివరి చిత్రమని చెప్పిన కమల్
తమిళనాట రజనీకాంత్ .. కమలహాసన్ తిరుగులేని కథానాయకులు. 'రోబో' సినిమాతో రజనీ కెరియర్లో చెప్పుకోదగిన విజయాన్ని అందించిన శంకర్, ఆ సినిమాకి సీక్వెల్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇక కమల్ కెరియర్లో గర్వించదగిన సినిమాగా 'భారతీయుడు'ను నిలిపిన శంకర్, ఆ సినిమాకి సీక్వెల్ ను సిద్ధం చేసే పనిలో వున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి.

ఈ సినిమాలో కమల్ సరసన కథానాయికగా కాజల్ ను ఎంపిక చేసుకున్న ఆయన, ఒక ముఖ్యమైన పాత్ర కోసం వెన్నెల కిషోర్ ను ఎంపిక చేసుకున్నాడు. కీలకమైన పాత్రలకి గాను శింబు .. దుల్కర్ సల్మాన్ ను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సంగీత దర్శకుడిగా అనిరుథ్ కి అవకాశం లభించింది. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది తాను చేసే చివరి చిత్రమని కమల్ చెప్పడంతో, సహజంగానే ఈ ప్రాజెక్టుపై అంతా ఆసక్తితో వున్నారు.    
rajani
kamal

More Telugu News