సిద్ధిపేటలో హరీశ్ రావుకు 13,040 ఓట్ల ఆధిక్యం!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబడిన హరీశ్ రావుకు తొలి రౌండ్ లోనే భారీ ఆధిక్యం లభించింది. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసేసరికి హరీశ్ రావు 13,040 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి ఆయన తన సమీప ప్రత్యర్థిపై 6,338 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, రెండో రౌండ్ కు అది రెట్టింపు కావడం గమనార్హం. సిద్ధిపేటలో హరీశ్ రావు దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారని టీఆర్ఎస్ యువనేత కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
KTR
Harish Rao
Siddipet District
Counting
Telangana Election 2018
Telangana Assembly Election
Telangana Assembly Results

More Telugu News