తొలి రౌండ్ లోనే ఆధిక్యం పొందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు వీరే!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత కౌంటింగ్ లో పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ముందున్నట్టు తొలి ట్రెండ్స్ వెలువడుతున్నాయి. నిర్మల్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఆలేటి మహేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉండగా, తుంగతుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్, వరంగల్ వెస్ట్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్, సిద్ధిపేటలో హరీశ్ రావు, జగిత్యాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి ఎం సంజయ్ కుమార్, ముథోల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం విఠల్ రెడ్డిలు ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా, మక్తల్ లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీఆర్ఎస్ కు 429, టీడీపీకి 312, బీజేపీ 298, స్వతంత్ర అభ్యర్థికి 175 ఓట్లు వచ్చాయి. 
Go Back to Shorts
Votes
Counting
Telangana Election 2018
Telangana Assembly Election
Telangana Assembly Results

More Telugu News