KCR: ఓ ప్రధాని, ప్రధాని పదవిపై కన్నేసినాయన, ఆరుగురు సీఎంల ప్రచారాన్ని కేసీఆర్ తిప్పికొట్టారు!: కేటీఆర్

షార్ట్స్‌లో చూడండి
నేటి ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్ విజయ దరహాసం చేయనున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి యువనేత కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు నిన్న రాత్రి తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ఒక ప్రధాని, అదే పదవిపై కన్నేసిన మరో ఆయన, ఆరుగురు ముఖ్యమంత్రులు, 11 మంది కేంద్ర మంత్రులు, ఇంకా చాలా మంది నేతలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. చివరికి వీటన్నింటినీ కేసీఆర్‌ ఒక్కరే తిప్పికొట్టారు. చివరికి ఆయనే గెలుస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.



Go Back to Shorts
KCR
KTR
Elections

More Telugu News