Peddapalli District: పెద్దపల్లి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల గల్లంతు.. ఆందోళన

  • అధికారులు మోసం చేశారు
  • ఇతరులతో వేయించారు
  • బాధ్యులపై చర్య తీసుకోవాలి
పెద్దపల్లి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గల్లంతవడం కలకలం రేపుతోంది. అధికారులు తమను మోసం చేశారంటూ ఎన్నికల సిబ్బంది ఆరోపిస్తున్నారు. తాము పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం నమోదు చేసుకున్నప్పటికీ.. తమ చేతికి మాత్రం అవి అందనీయకుండా అధికారులు మోసం చేశారని మంథనిలో ఎన్నికల సిబ్బంది ఆందోళనకు దిగారు. దాదాపు 200లకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఇతరులతో వేయించారని పేర్కొంటున్న ఉద్యోగులు బాధ్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Peddapalli District
Manthani
Postal Ballet Votes

More Telugu News