Chandrababu: బీజేపీ సహకారం లేకుంటే చంద్రబాబు ఎప్పటికీ సీఎం కాలేడు: సోము వీర్రాజు

  • చంద్రబాబుది ఒక ఫ్లాప్ షో
  • వాజ్‌పేయి ఓటమికి బాబే కారణం
  • 6న ఏపీలో మోదీ పర్యటన
బీజేపీ సహకారం లేకుంటే చంద్రబాబు ఎప్పటికీ సీఎం కాలేడని బీజేపీ నేత సోము వీర్రాజు పేర్కొన్నారు. నేడు గుంటూరులో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ లేకుంటే చంద్రబాబు జీరో అని తెలిపారు. గతంలో వాజ్‌పేయి ఓటమి పాలవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. చంద్రబాబు ఊహించిన దానికి విరుద్ధంగా ఏపీ రాజకీయాలు ఉండబోతున్నాయన్నారు.

చంద్రబాబుదొక ఫ్లాప్ షో అని, ఏపీలో విఫలమైనట్టే జాతీయ స్థాయిలో కూడా విఫలమవుతాడని సోము వీర్రాజు విమర్శించారు. రేపు మూడు రాష్ట్రాల్లో వెలువడనున్న ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జనవరి 6న ఏపీలో మోదీ పర్యటిస్తారని, అనంతరం తాము రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతామని స్పష్టం చేశారు. మోదీ పరిపాలనతో టీడీపీ కనుమరుగవుతుందన్న భయంతోనే ధర్మపోరాట దీక్షలు చేస్తున్నారని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.
Chandrababu
Somu veerraju
Narendra Modi
BJP
Telugudesam

More Telugu News