delhi: ఢిల్లీలో ముగిసిన బీజేపీ యేతర పార్టీల సమావేశం

  • పార్లమెంట్ లోపల, బయట చేపట్టే ఆందోళనలపై చర్చించాం
  • రేపు విపక్ష పార్టీల నేతలంతా రాష్ట్రపతిని కలుస్తారు
  • మీడియాతో చంద్రబాబు
రేపు విపక్ష పార్టీల నేతలంతా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలుస్తారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. పార్లమెంట్ అనెక్స్ హాలులో బీజేపీ యేతర పార్టీల సమావేశం ముగిసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్, అగ్రనేత సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీఎంలు మమతా బెనర్జీ, కేజ్రీవాల్ తదితర నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు.

కేంద్రానికి వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణ ఖరారుపై ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. అనంతరం, మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, పార్లమెంట్ లోపల, బయట చేపట్టే ఆందోళనలపై చర్చించామని చెప్పారు. కాగా, బీజేపీయేతర పార్టీల సమావేశానికి ఎస్పీ, బీఎస్పీ నేతలు హాజరు కాలేదు.
delhi
Chandrababu
Rahul Gandhi
sonia gandhi
banarjee

More Telugu News