kcr: కేసీఆర్ తో ముగిసిన ఎంఐఎం అధినేత భేటీ.. టీఆర్ఎస్ కే మద్దతన్న అసదుద్దీన్

  • ఎంఐఎం అభ్యర్థులు 8 మంది గెలుస్తారు
  • పార్టీ విజయం పట్ల కేసీఆర్ కూడా విశ్వాసంతో ఉన్నారు
  • ప్రజలు కేసీఆర్ ను మరోసారి దీవించారు
సీఎం కేసీఆర్ తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భేటీ ముగిసింది. అనంతరం, మీడియాతో అసదుద్దీన్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ అధికారంలో కొస్తుందని తనకు పూర్తి నమ్మకముందని, పార్టీ విజయం పట్ల కేసీఆర్ కూడా విశ్వాసంతో ఉన్నారని అన్నారు.

ప్రజలు కేసీఆర్ ను మరోసారి దీవించారని, టీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరి అవసరం లేకుండానే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, చెప్పిన అసదుద్దీన్, తాము 8 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని అన్నారు. తమ మద్దతు ఎప్పుడూ టీఆర్ఎస్ కే ఉటుందని, తమ భేటీలో ఎక్కువగా జాతీయ రాజకీయాల గురించి చర్చించామని అన్నారు.  
kcr
TRS
Asaduddin Owaisi
mim

More Telugu News