praja kutami: ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ చేసి ‘కాంగ్రెస్’కి మద్దతివ్వాలని కోరారు: టీఆర్ఎస్ నేత మర్రి ఆరోపణ

  • ప్రజా కూటమి నీచ రాజకీయాలకు పాల్పడుతోంది
  • మా ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కోవాలని చూస్తోంది
  • విశ్వేశ్వర్ రెడ్డి రెండు సార్లు నాకు ఫోన్ చేశారు
ప్రజా కూటమి నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, తమ ఎమ్మెల్యేలను వారి వైపు లాగేసుకోవాలని చూస్తోందంటూ టీఆర్ఎస్ నేత, నాగర్ కర్నూల్ నియోజక వర్గ టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ చేసి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారని ఆరోపించారు. 9490861960 నెంబర్ నుంచి మధ్యాహ్నం 2.07 గంటలకు ఓసారి, మరో కాల్ 2.56 గంటలకు చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రలోభాలను వెంటనే ఆపివేయాలని హెచ్చరించారు.
praja kutami
marri janardhan
congress

More Telugu News