balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ నుంచి రానున్న సెకండ్ సింగిల్ వాయిదా

  • షూటింగు దశలో ఎన్టీఆర్ బయోపిక్ 
  • 10 మందికి పైగా కథానాయికలు
  • అభిమానుల్లో పెరుగుతోన్న ఉత్సాహం        
ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన షూటింగ్ చకచకా జరిగిపోతోంది. మొదటి భాగమైన 'కథానాయకుడు' విడుదల జనవరి 9వ తేదీనే ఉండటంతో, ఆ దిశగా పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్స్ తోపాటు సాంగ్స్ ను కూడా వదులుతున్నారు. ఇటీవల వదిలిన ఫస్టు సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, రెండవ సాంగ్ గా 'రాజర్షి'ని ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

కారణమేమిటనేది తెలియదు గానీ, ఈ ఆలోచనని విరమించుకుని 2వ సాంగ్ విడుదల తేదీని ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల 31 నిమిషాలకి ఈ సాంగ్ ను విడుదల చేయనున్నట్టుగా మరో ప్రకటన చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ తో బాలకృష్ణ మంచి మార్కులు కొట్టేశారు. ఆయనతో 10 మందికి పైగా కథానాయికలు స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ సంచలన విజయానికి తెరతీయడం ఖాయమనేది నందమూరి అభిమానుల మాట.    
balakrishna
rakul
nithya
hansika

More Telugu News