Ponnam Prabhakar: ప్రజాకూటమి విజయం ఖరారైపోయింది: పొన్నం ప్రభాకర్

  • తెలంగాణలో మహాకూటమిదే అధికారం
  • వంద సీట్లు గెలుస్తామని టీఆర్ఎస్ చెప్పుకోవడం పిచ్చి ప్రేలాపన
  • ఈవీఎంలను మేనేజ్ చేసి వంద సీట్లు గెలుస్తారా?
తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి రానుందని... ఇప్పటికే విజయం ఖరారైపోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజల్లో అపోహలు కల్పించేందుకు కేసీఆర్ ఎంతో ప్రయత్నించినా... కూటమి అధికారంలోకి వస్తోందని చెప్పారు. సరైన అభ్యర్థుల ఎంపిక, నేతల మధ్య సమన్వయం, సమష్టి కృషి, ప్రచార సరళితో కూటమి అభ్యర్థులు గెలుపొందుతారని తెలిపారు. టీఆర్ఎస్ వంద సీట్లను గెలుస్తుందని వారు చెప్పుకోవడం పిచ్చి ప్రేలాపనే అని అన్నారు. ఈవీఎంలను మేనేజ్ చేసి వంద సీట్లను గెలుస్తారా? అని ప్రశ్నించారు. కరీంనగర్ నుంచి తాను పోటీ చేస్తానని తెలియగానే... టీఆర్ఎస్ ప్రభుత్వ అభ్యర్థి గంగుల హైరానా పడిపోయారని ఎద్దేవా చేశారు. 
Ponnam Prabhakar
kcr
congress
TRS

More Telugu News