madypradesh: ఆవు దూడలకు రాజకీయ పార్టీల పేర్లు.. ఓ రైతు ముచ్చట!

  • అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ పేర్లు పెట్టి ఆసక్తికి తెరలేపిన అన్నదాత
  • వారెప్పటికీ కలవరు...కనీసం ఈ దూడ రూపంలోనైనా కలిసుంటారు
  • తెవిగా సమాధానం ఇచ్చిన రైతు
పిల్లలకు జాతీయ నాయకులు, సెలబ్రిటీల్లో అభిమానించే వారి పేర్లు పెట్టుకోవడం సహజం. అయితే, ఓ రైతు వినూత్నంగా తన ఆవుకు పుట్టిన కవల దూడలకు అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ పార్టీ పేర్లు పెట్టి ఆసక్తి రేకెత్తించాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... రాష్ట్రానికి చెందిన ధన్‌సింగ్‌ కు చెందిన ఓ ఆవు ఇటీవల రెండు దూడలకు జన్మనిచ్చింది. ఆవు కవలకు జన్మ నివ్వడం అరుదుగా జరుగుతుంది. పైగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో పోటాపోటీగా ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ సంఘటన జరిగింది. దీంతో ధన్‌సింగ్‌ వినూత్నంగా ఉండాలని దూడల్లో ఒకదానికి బీజేపీ అని, రెండో దానికి కాంగ్రెస్‌ అని పేరు పెట్టాడు.

ఆశ్చర్యపోయిన స్థానికులు కొందరు ‘అన్నదమ్ములైన కవలలకు నిత్యం జగడానికి దిగే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల పేర్లు ఎందుకు పెట్టావ్‌’ అని ప్రశ్నిస్తే సమాధానం కూడా ఆసక్తి కలిగినదే ఇచ్చాడు. దేశంలో కాంగ్రెస్‌, బీజేపీ పక్షాలు ఎప్పటికీ కలవవు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో రెండు పార్టీలు ఏ స్థాయిలో దూషించుకున్నదీ చూశాం. కనీసం దూడలకైనా వాటి పేర్లు పెడితే కలిసి ఉన్నాయన్న ఆనందం మిగులుతుంది’ అని తెలివిగా సమాధానం ఇచ్చాడు.

పల్లె రైతుల్లో రాజకీయాలపై పెద్దగా అవగాహన ఉండదు అన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అటువంటి వారు ధన్‌సింగ్‌ సమాధానం విని నోరువెళ్లబెడుతున్నారు.
madypradesh
twin baby animals
names of political parties

More Telugu News