prajakutami: ప్రజాకూటమి నేతలకు అపాయింట్ మెంట్ ఇచ్చిన గవర్నర్

  • నాలుగు పార్టీలను ఒక జట్టుగా గుర్తించాలని కోరనున్న ప్రజాకూటమి నేతలు
  • మధ్యాహ్నం 3.15 గంటలకు అపాయింట్ మెంట్ ఖరారు
  • రేపు వెల్లడి కానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. మరోవైపు, ప్రజాకూటమిగా పోటీ చేసిన నాలుగు పార్టీలను ఒక జట్టుగా గుర్తించాలని కూటమి నేతలు కోరుతున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని గవర్నర్ నరసింహన్ కు విన్నవించేందుకు ఆయన అపాయింట్ మెంట్ ను కోరారు. ఈ నేపథ్యంలో, కూటమి నేతలకు మధ్యాహ్నం 3.15 గంటలకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. గవర్నర్ తో భేటీ సందర్భంగా, కాంగ్రెస్ నేతలపై జరిగిన భౌతిక దాడులు, ఓట్ల గల్లంతుపై కూడా నేతలు ఫిర్యాదు చేయనున్నారు.  
prajakutami
governot
appointment
telangana

More Telugu News