puttaparthi: ఆత్మహత్య చేసుకున్న పుట్టపర్తి డీఎస్పీ కుమారుడు

  • నిన్న రాత్రి కర్నూలు నుంచి వచ్చిన శ్రీనివాస్ 
  • ఉదయం ఉరికి వేలాడుతూ కనిపించిన వైనం 
  • చదువు విషయంతో ఒత్తిడి తట్టుకోలే ఆత్మహత్య
అనంతపురం జిల్లా పుట్టపర్తి డీఎస్పీ రామకృష్ణయ్య కుమారుడు శ్రీనివాసులు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వయసు 19 సంవత్సరాలు. నిన్న రాత్రి అనంతపురంలోని ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీవీకేకే కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న శ్రీనివాసులు... రెండు రోజుల పాటు సెలవులు రావడంతో కర్నూలుకు వెళ్లాడు.

నిన్న రాత్రి తిరిగి వచ్చిన అతను... ఈ ఉదయం ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదువు విషయంలో ఒత్తిడిని తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ లో అతను పేర్కొన్నాడు. పోస్టు మార్టం నిమిత్తం శ్రీనివాస్ మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
puttaparthi
dsp
son
suicide

More Telugu News