live in relationship: ప్రియురాలితో సహజీవనం చేశాడు.. చివరకు ఆమెనే చంపేశాడు!

  • రెండేళ్ల క్రితం భర్తకు విడాకులిచ్చిన జయశ్రీ
  • ప్రియుడు సక్పాల్ తో సహజీవనం
  • గొడవల కారణంగా ప్రియురాలిని చంపేసిన సక్పాల్
సహజీవనం చేసిన ప్రియురాలిని ఆమె ప్రియుడే అంతమొందించిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ముంబైలోని మన్ పద ప్రాంతంలో జయశ్రీ (26) అనే మహిళ రెండేళ్ల క్రితం తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తన ప్రియుడు సక్పాల్ (30)తో సహజీవనం చేసేది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో, వారం క్రితం సక్పాల్ పై జయశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, అతన్ని పోలీసులు హెచ్చరించి పంపేశారు.

ఆ తర్వాత ఇద్దరికీ మరోసారి పెద్ద గొడవైంది. ఈ క్రమంలో ఒక పదునైన ఆయుధంతో కొట్టగా ఆమె మరణించింది. దీంతో, ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే వదిలేసి, తాళం వేసి పరారయ్యాడు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి, ఇంటి  తలుపులు పగలగొట్టి చూడగా, జయశ్రీ మృతదేహం కనిపించింది. సక్పాల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు, జయశ్రీ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం రుక్మిణీబాయి ఆసుపత్రికి తరలించారు. 
live in relationship
murder
mumbai

More Telugu News