Narendra Modi: ఏ వితంతువు?... అంటూ మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు!

  • వింతతు పింఛన్ డబ్బు కాంగ్రెస్ వితంతువు ఖాతాలోకి
  • దుమారాన్ని రేపుతున్న మోదీ వ్యాఖ్యలు
  • మహిళలందరికీ అవమానమన్న సిద్ధరామయ్య
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. గత వారంలో రాజస్థాన్ లో పర్యటించిన ఆయన ఓ ప్రచార సభలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఆయన వ్యాఖ్యలు సోనియాగాంధీని ఉద్దేశించే చేశారని, తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

 నరేంద్ర మోదీ మాట్లాడుతూ, "కాంగ్రెస్‌ పలు కుంభకోణాలకు పాల్పడింది. వితంతు పింఛను పథకం అందులో ఒకటి. మరి ఏ కాంగ్రెస్‌ వితంతువు అకౌంట్ లోకి ఈ మొత్తం చేరిందో?" అని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన సీడబ్ల్యూసీ సభ్యుడు సిద్ధరామయ్య, ప్రధాని దిగజారుడుతనానికి ఇది తాజా ఉదాహరణని అన్నారు. ఆయన తమ మాట్లతో ప్రధాని పదవికే కళంకం తెచ్చారని, మహిళలందరికీ ఇది అవమానమని నిప్పులు చెరిగారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నుంచి నరేంద్ర మోదీ నేర్చుకోవాల్సింది చాలా ఉందని అన్నారు.
Narendra Modi
Congress
Widow

More Telugu News