Telugudesam: ఢిల్లీలో రేపటి సమావేశంలోనే జాతీయ కూటమి పేరు, ఎజెండా నిర్ణయిస్తాం: కంభంపాటి

  • ‘ప్రజాఫ్రంట్’ అనే పేరు ఉంటుందా లేదో తేలేది రేపు
  • ఎజెండా నిర్ణయించేది కూడా రేపే
  • రేపటి సమావేశానికి ఏడుగురు సీఎంలు రానున్నారు
ఢిల్లీలో రేపు విపక్షాల సమావేశంలోనే జాతీయ కూటమి పేరు, ఎజెండా నిర్ణయిస్తామని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ప్రజాఫ్రంట్’ అనే పేరు ఉంటుందా లేక మరేదైనా పేరుగా మారుస్తారా? అనే విషయం రేపు నిర్ణయిస్తామని అన్నారు.

రేపటి సమావేశానికి ఏడు రాష్ట్రాల సీఎంలతో సహా ఇతర పార్టీల ముఖ్యనేతలు హాజరుకానున్నారని అన్నారు. రేపటి బీజేపీ యేతర పక్షాల సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా వచ్చే అవకాశముందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సరికొత్త ఫ్రంట్ ఏర్పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
Telugudesam
Kambhampati Rammohan Rao
Rahul Gandhi
Sonia Gandhi

More Telugu News