praja kutami: ప్రజా కూటమి గెలుపును సోనియాకు కానుకగా ఇస్తాం: రేవంత్ రెడ్డి

  • ఈ నెల 11న ప్రజాకూటమి గెలవబోతోంది
  • గెలుపును ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాం
  • నాలుగు కోట్ల ప్రజలకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నా
తెలంగాణ ఎన్నికల్లో ప్రజా కూటమి గెలుపును సోనియా గాంధీకి పుట్టినరోజు కానుకగా ఇస్తామని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 11న ప్రజాకూటమి గెలవబోతోందని, గెలుపును ఆస్వాదించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు రాబోతోందని అన్నారు. తెలంగాణకు పట్టిన చీడ పీడలను వదిలించుకోవడానికి ప్రజలకు మంచి అవకాశం లభించిందని, విలక్షణమైన తీర్పు ఇవ్వనున్నారని, నాలుగు కోట్ల ప్రజలకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
praja kutami
Revanth Reddy
Sonia Gandhi

More Telugu News