kcr: ప్రజాకూటమిపై చేసిన ప్రచారం టీఆర్ఎస్ కే నష్టం చేసింది: పొన్నం ప్రభాకర్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజాకూటమి పొత్తులపై కేసీఆర్ ఎంత దుష్ప్రచారం చేసినన్పటికీ, ఆ పార్టీకి నష్టం కలిగిందని అన్నారు. బీజేపీ, ఎంఐఎంతో టీఆర్ఎస్ అంతర్గత పొత్తు వాస్తవం కాదా? అని ఈ సందర్భంగా పొన్నం ప్రశ్నించారు.

2014 ఫలితాలు తారుమారై, ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రకటనల పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని టీఆర్ఎస్ నేతలు ఆరోపించడంలో వాస్తవం లేదని అన్నారు. వంద సీట్లు సాధిస్తామని కేసీఆర్ చెబుతున్నారంటే.. సర్వే ఫలితాలు చూసి భయపడి అయినా ఉండాలి? లేదా ఈవీఎంలను మేనేజ్ అయినా చేసి ఉండాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
kcr
vh
TRS
prajakutami

More Telugu News