Telugudesam: ఏపీలో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తాం: కన్నా లక్ష్మీనారాయణ

  • 2019లో ఏపీలో టీడీపీకి గడ్డుకాలమే
  • తల్లి, పిల్ల కాంగ్రెస్ కు ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలే
  • మోదీపై టీడీపీ అసత్యప్రచారం చేస్తోంది
ఏపీలో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వాల్మీకులను ఎస్టీలలో చేర్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రథయాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా పెనుకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2019లో ఏపీలో టీడీపీకి గడ్డుకాలమేనని, తల్లి, పిల్ల కాంగ్రెస్ కు ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని అన్నారు. మోదీపై టీడీపీ అసత్యప్రచారం చేస్తోందని, ఇవన్నీ ప్రజలు గమినిస్తున్నారని అన్నారు.
Telugudesam
kanna laxmi narayana
bjp

More Telugu News