srinagar: 17 గంటలపాటు కొనసాగిన ఎన్ కౌంటర్.. ముగ్గురు ముష్కరులను కాల్చి చంపిన జవాన్లు

  • శ్రీనగర్ శివార్లలోని గ్రామంలో ఎన్ కౌంటర్
  • గాయపడ్డ ఐదుగురు జవాన్లు
  • చనిపోయిన ఉగ్రవాదులు లష్కరే తాయిబాకు చెందిన వారిగా గుర్తింపు
జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ లో నిన్న సాయంత్రం భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ప్రారంభమైన ఎదురుకాల్పులు దాదాపు 17 గంటల పాటు కొనసాగాయి. శ్రీనగర్ శివార్లలోని ముజ్గండ్ గ్రామంలో టెర్రరిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతాబలగాలు, పోలీసులు నిన్న సాయంత్రం గాలింపు చర్యలను ప్రారంభించారు.

 ఈ క్రమంలో వారిపై టెర్రరిస్టులు కాల్పులను ప్రారంభించారు. వీరికి దీటుగా భద్రతా బలగాలు కూడా కాల్పులు మొదలెట్టాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులను భద్రతాబలగాలు కాల్చి చంపాయి. ఇదే సమయంలో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. ఎన్ కౌంటర్ లో చనిపోయిన ఉగ్రవాదులను లష్కరే తాయిబాకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలిలో వారికి సంబంధించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
srinagar
encounter
lashkar e toiba

More Telugu News