జగన్ దెబ్బకు గోల్డ్ మెడల్ సాధించిన ఐఏఎస్ లు జైలుకు వెళ్లాల్సివచ్చింది!: మంత్రి దేవినేని
- తండ్రి సాయంతో భారీ అవినీతికి పాల్పడ్డారు
- 16 నెలలు జైలులో ఉన్నా మార్పు రాలేదు
- తోటపల్లి ప్రాజెక్టుపై బోత్స,ధర్మానను ప్రశ్నించండి
వైఎస్ జగన్ అవినీతికి పాల్పడ్డాడు కాబట్టే ఆయనకు చెందిన వేల కోట్ల రూపాయలను ఈడీ జప్తు చేసిందని ఉమ వ్యాఖ్యానించారు. ఏపీలో అన్ని పంటలకు నీరు అందిస్తున్న ఘనత చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వానిదేనని కితాబిచ్చారు.13 అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ అవినీతిరహిత పాలన తెస్తాననడం దొంగే.. దొంగ..దొంగ.. అని అరిచినట్లు ఉందని ఎద్దేవా చేస్తారు.
జగన్ దెబ్బకు గోల్డ్ మెడల్ సాధించిన ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో తోటపల్లి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో పక్కనే ఉన్న బొత్స సత్యనారాయణ, ధర్మన ప్రసాదరావును అడగాలని సూచించారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి ఏపీ ప్రజలు మరోసారి అధికారం అప్పగించబోతున్నారని జోస్యం చెప్పారు.