bhp: రామ మందిరం కోసం పార్లమెంటులో బిల్లు పెట్టండి.. ఢిల్లీలో నేడు వీహెచ్పీ భారీ ర్యాలీ

  • రామ మందిర నిర్మాణం కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలంటూ డిమాండ్
  • రాంలీలా మైదానంలో భారీ సభ
  • ప్రసంగించనున్న భయ్యాజీ, సదాశివ్, అలోక్ కుమార్
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ తన పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. ఆలయ నిర్మాణం కోసం బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు భారీ ర్యాలీని నిర్వహించనుంది.

మరోవైపు, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారనే నమ్మకం తమకుందని ఆరెస్సెస్ తెలిపింది. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఈరోజు జరగనున్న భారీ సభలో ఆరెస్సెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు భయ్యాజీ జోషీ కీలక ప్రసంగం చేయనున్నారు. ఆయనతో పాటు వీహెచ్పీ అధ్యక్షుడు సదాశివ్ కోక్జే, అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ లు కూడా ప్రసంగించనున్నారు.

ఈ సందర్భంగా వీహెచ్పీ అధికార ప్రతినిధి వినోద్ భన్సాల్ మాట్లాడుతూ, ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరుకానున్నారని తెలిపారు. ఆలయం నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నవారి మనసులను కూడా ఈ సభ మార్చబోతోందని చెప్పారు.
bhp
rss
ayodhya
ram mandir
delhi
ramleela ground
rally

More Telugu News