Chandrababu: అంబానీల ఇంట పెళ్లి వేడుకకు చంద్రబాబు!

  • ఉదయ్‌పూర్‌లో జరిగే కార్యక్రమానికి బుధవారం హాజరుకానున్న సీఎం
  • ముందస్తు పెళ్లి వేడుకలతో హోరెత్తిపోతున్న ఉదయ్ పూర్
  • హిల్లరీ క్లింటన్‌ వంటి ప్రముఖుల రాక
భారత్‌లో అత్యంత సంపన్నుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ముఖేష్‌ అంబాని, నీతా అంబానీల ముద్దుల తనయ ఈశా అంబానీ పెళ్లి వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతున్నారు.  రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో ఈశా వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అంబానీ దంపతులు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ వేడుకలకు ఆహ్వానం అందడంతో చంద్రబాబు బుధవారం హాజరుకానున్నారు. ఇప్పటికే ముందస్తు పెళ్లి వేడుకలతో ఉదయ్‌పూర్‌ హోరెత్తిపోతోంది. వేడుకలకు వచ్చే అతిరథుల విమానాల రాకతో కలినా విమానాశ్రయం రద్దీగా కనిపిస్తోంది. అమెరికా నుంచి హిల్లరీక్లింటన్ వంటి ప్రముఖులతోపాటు భారత్‌లోని పారిశ్రామిక, సినీ, క్రీడా దిగ్గజాలు హాజరవుతుండడం గమనార్హం.
Chandrababu
esa ambani
udaypur

More Telugu News