jana sena: అవినీతి రహిత సమాజం ‘జనసేన’తోనే సాధ్యం: రావెల కిషోర్ బాబు

  • అవినీతిని పారద్రోలేందుకు జనసేన పోరాడుతోంది
  • అవినీతి రహిత పాలన కోసం ప్రజలు కలిసి రావాలి
  • ప్రజల కోసం ప్రభుత్వం పని చేయాలి
అవినీతి రహిత సమాజం ‘జనసేన’ తోనే సాధ్యమని ఆ పార్టీ నేత రావెల కిషోర్ బాబు అన్నారు. విజయవాడలోని రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేటి రాజకీయ వ్యవస్థలో ఉన్న అవినీతిని పారద్రోలేందుకు ‘జనసేన’ పోరాడుతుందని చెప్పారు. వ్యవస్థలో ఉన్న అసమానతల కారణంగానే దళితులు దళితులుగా, పేదలు పేదవాళ్లుగానే మిగిలిపోతున్నారని అన్నారు.

 నూతన సమాజం కోసం, మార్పు కోసం ‘జనసేన’ కృషి చేస్తోందని, అవినీతి రహిత పాలన కోసం ప్రజలందరూ కలిసి రావాలని పిలుపు నిచ్చారు. ప్రజల కోసం ప్రభుత్వం పని చేయాలి కానీ, రాజకీయ నాయకుల స్వప్రయోజనాల కోసం కాదని అన్నారు. తమ పార్టీ లక్ష్యాలను, విధివిధానాలను ప్రజలకు తెలియజేసేందుకే ‘జనసేన తరంగం’ను పవన్ కల్యాణ్ ప్రారంభించారని చెప్పారు. ఈ కార్యక్రమం ఈ నెల 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని అన్నారు.
jana sena
ravel kishore babau
jana tarangam

More Telugu News