Mukhesh Ambani: ఈశా అంబానీ పెళ్లికి వచ్చే అతిథులకు 'ఫొటోల' ఆంక్షలు!

  • 12న జరగనున్న వివాహం
  • సెల్‌ఫోన్లు నిషేధం
  • ఫొటోలను షేర్ చేయకూడదు
ముకేష్ అంబానీ ముద్దుల తనయ ఈశా వివాహం ఆనంద్ పిరమాల్‌తో ఈ నెల 12న జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. దీనికి ఉదయ్‌పూర్‌లోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్ వేదికగా మారింది. నేడు మెహందీ, రేపు సంగీత్ వేడుక జరగనున్నాయి. అయితే ఈ వివాహానికి వచ్చే అతిథులకు ఆంక్షలు విధించారు.

 పెళ్లికి వచ్చే అతిథులెవరూ ఫోన్లు తీసుకెళ్లడానికి వీల్లేదు. అంతేకాదు.. వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం నిషేధం. ఈ మేరకు ముకేష్ దంపతులు అతిథులను సహకరించాలని కోరారు. వివాహ వేడుక పూర్తయిన రోజే స్వయంగా అంబానీ కుటుంబ సభ్యులు ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తామని వెల్లడించారు.
Mukhesh Ambani
Eesha
Anand Piramal
Udaypur
Social Media
Mobile Phones

More Telugu News