Narayana: ఇళ్ల కేటాయింపు కార్యక్రమంలో మంత్రి నారాయణతో గొడవకు దిగిన వైసీపీ ఎమ్మెల్యే

  • ఎన్టీఆర్ నగర్‌లో ఇళ్ల కేటాయింపు
  • మంత్రితో సంజీవయ్య వాగ్వాదం
  • ప్రశ్నిస్తే పోలీసులతో నెట్టిస్తారా? అని ఆగ్రహం
లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు కార్యక్రమంలో మంత్రి నారాయణతో వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్య గొడవకు దిగారు. నేటి మధ్యాహ్నం నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎన్టీఆర్ నగర్‌లో జరిగిన లబ్ధిదారుల ఇళ్ల కేటాయింపు కార్యక్రమంలో నారాయణ పాల్గొని ఇళ్లను కేటాయించారు.

ఈ కార్యక్రమం జరుగుతుండగా.. మంత్రితో సంజీవయ్య వాగ్వాదానికి దిగారు. నిర్ణయించిన కార్యక్రమాలకు కాకుండా మరో చోటుకు రమ్మనడం సభ్యత కాదని నారాయణ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసులతో నెట్టిస్తారా? అని సంజీవయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  
Narayana
Sanjeevaiah
Nellore
NTR nagar
YSRCP

More Telugu News