చీరాలలో వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
- సుబ్బయ్యను స్టేజి మీదకు పిలవలేదని ఘర్షణ
- బాలాజీ, సుబ్బయ్య వర్గాల మధ్య తోపులాట
- పరిస్థితిని అదుపు చేసిన మోపిదేవి
గత ఎన్నికల్లో ఎక్కువ మంది కౌన్సిలర్లను గెలిపించడంలో కీలక పాత్ర వహించిన సుబ్బయ్యను పిలవకపోవడమేంటని నియోజకవర్గ ఇన్చార్జ్ బాలాజీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బాలాజీ, సుబ్బయ్య ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పెద్ద ఎత్తున తోపులాటలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మోపిదేవి జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు.