Jagan: రాజధాని చుట్టూ భూముల్ని చంద్రబాబు బినామీలే కొన్నారు: జగన్

  • ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తున్నారు
  • రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది
  • పేదల ఇంటి రుణాలన్నీ మాఫీ చేస్తాం
రాజధాని అమరావతి చుట్టూ ఉన్న భూముల్ని సీఎం చంద్రబాబు బినామీలే కొన్నారని ప్రతిపక్ష నేత, వైసీపీ అధిపతి వైఎస్ జగన్ ఆరోపించారు. నేడు శ్రీకాకుళం జిల్లాలో జరిపిన పాదయాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడిగా జన్మించడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు.

చంద్రబాబు ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని.. సీఎం రమేష్ కంపెనీకి వంశధార ప్రాజెక్టు పనులు కట్టబెట్టారన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం తన తండ్రి రూ.700 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పేదల ఇంటి రుణాలన్నీ మాఫీ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.
Jagan
Rajasekhar Reddy
Chandrababu
Amaravathy
Vamsadhara Project

More Telugu News