Chandrababu: చంద్రబాబుతో పొత్తు వల్ల ప్రజాకూటమికి నష్టం జరిగింది: కేటీఆర్

  • కాంగ్రెస్, టీడీపీల పొత్తు అపవిత్రం
  • కూటమి నేతలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు
  • ఓటర్ల జాబితాలో పొరపాట్లను సరిదిద్దాలని ఈసీని కోరాం
చంద్రబాబుతో పొత్తు వల్ల ప్రజాకూటమికి నష్టం వాటిల్లిందని టీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయం తెలుసుకున్న కూటమి నేతలు, ఎన్నికల ప్రచారం చివరి రెండు రోజుల్లో చంద్రబాబు ఫొటో లేకుండానే తిరిగారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తు అపవిత్రమైందని, ఈ ఎన్నికల్లో విజయం కోసం కూటమి నేతలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రకటనలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఈవీఎంల పనితీరు గురించి తమకు ఎలాంటి సందేహాలు లేవని, ఓటర్ల జాబితాలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.
Chandrababu
KTR
TRS
prajakutami

More Telugu News