Lenovo Z5s: అద్భుత ఫీచర్లతో లెనోవా నుండి మరో స్మార్ట్ ఫోన్ రాబోతోంది!
మొబైల్ దిగ్గజం లెనోవా నూతన స్మార్ట్ ఫోన్ ని ఈనెల 18న చైనాలో విడుదల చేయనుంది. 'లెనెవో జడ్5ఎస్' పేరిట విడుదల కానున్న ఈ ఫోన్ లో ట్రిపుల్ బ్యాక్ కెమెరాలతో పాటు పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. రెండు రోజుల క్రితమే ఈ ఫోన్ విడుదల కావలసి ఉండగా కొన్ని సాంకేతిక కారణాల వలన ఈ నెల 18న విడుదల చేయబోతున్నట్లు చైనా విభాగం లెనోవా వైస్ ప్రెసిడెంట్ చాంగ్ చెంగ్ తెలిపారు. కాగా, ఈ ఫోన్ కి సంబంధిన పూర్తి వివరాలు విడుదల రోజునే తెలియనున్నాయి.