mahesh babu: 'వచ్చాడయ్యో సామీ'ని మించిన రేంజ్ లో 'మహర్షి' గ్రూప్ సాంగ్

  • విలేజ్ సెట్లో 'మహర్షి' షూటింగ్ 
  • మహేశ్ స్నేహితుడిగా అల్లరి నరేశ్ 
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు  
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా 'మహర్షి' రూపొందుతోంది. కథా పరంగా ఈ సినిమా కొంతభాగం విదేశాల్లోనూ .. మరికొంత భాగం ఇండియాలోని ఒక మారుమూల గ్రామంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడ ప్రత్యేకంగా వేసిన విలేజ్ సెట్లో ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరో రెండువారాల పాటు ఇక్కడే షూటింగు జరుగుతుందట. మహేశ్ బాబు ఇంతకు ముందు చేసిన 'భరత్ అనే నేను'లో 'వచ్చాడయ్యో సామీ' సాంగ్ ఎంతగా జనంలోకి దూసుకెళ్లిందో తెలిసిందే. అంతకి మించిన గ్రూప్ సాంగ్ ఒకటి ఈ సినిమా కోసం ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్లోనే ఈ సాంగ్ ను కూడా చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా కనిపించనున్న ఈ సినిమాలో, అల్లరి నరేశ్ .. జగపతిబాబు .. ప్రకాశ్ రాజ్ .. రావు రమేశ్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు.  
mahesh babu
pooja hegde

More Telugu News