Nellore District: కారుతో బీభత్సం సృష్టించిన అగర్వాల్ హాస్పిటల్ ఎండీ శివప్రతాప్ రెడ్డి అరెస్ట్!

  • నెల్లూరు రహదారిపై అదుపు తప్పిన కారు
  • పలు వాహనాలను ఢీకొట్టిన శివప్రతాప్
  • నలుగురికి గాయాలు
వేగంగా కారు నడుపుతూ బీభత్సం సృష్టించిన అగర్వాల్ హాస్పిటల్స్ ఎండీ శివప్రతాప్ రెడ్డిని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం ఆయన స్థానిక కిమ్స్ ఆసుపత్రి సమీపంలో వెళుతూ, అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొంటూ ముందుకు వెళ్లారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు అయ్యాయి. పలు కార్లు, ద్విచక్ర వాహనాలూ ధ్వంసం అయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. కారును నడిపిన శివప్రతాప్ ను అదుపులోకి తీసుకున్నారు. కారు అదుపు తప్పడానికి గల కారణాలు తెలియాల్సివుంది. కేసును విచారిస్తున్నామని, ఆయన మద్యం తాగి ఉన్నాడా? అన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. 
Nellore District
Car
Agarwal Hospitals
MD
Sivapratap reddy
Arrest
Police

More Telugu News