Twitter: ట్వీట్లకు స్పందనలు... టాప్ లో నరేంద్ర మోదీ, 9వ స్థానంలో మహేష్ బాబు!

  • ట్వీట్లకు వచ్చే స్పందనలను బట్టి ర్యాంకులు
  • రెండో స్థానంలో రాహుల్ గాంధీ
  • 8వ స్థానంలో కోలీవుడ్ హీరో విజయ్
రాజకీయ నాయకుల నుంచి సినీ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు తమకు చెందిన విశేషాలను నిత్యమూ సోషల్ మీడియా ద్వారా అభిమానులు, అనుచరులతో పంచుకుంటూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ప్రముఖులు ట్వీట్లు చేసినప్పుడు అవి వైరల్ అవుతూ, ప్రశంసలతో పాటు విమర్శలనూ తెచ్చుకుంటాయి.

ఇక ట్వీట్లపై అత్యధిక స్పందనలు పొందే వారి జాబితాను పరిశీలిస్తే, ప్రధాని నరేంద్ర మోదీ తొలి స్థానంలో ఉన్నారు. ఆయన తరువాత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలిచారు. టాప్ 10లో కోలీవుడ్ కు చెందిన హీరో విజయ్ 8వ స్థానంలో ఉండగా, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 9వ స్థానంలో ఉన్నారు.
Twitter
Narendra Modi
Mahesh Babu
Rahul Gandhi

More Telugu News