Kadiam Srihari: వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌ ఖాయం : కడియం శ్రీహరి

  • మళ్లీ కేసీఆర్‌ రావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు
  • ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కారణం
  • రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించబోతోందని, వరంగల్‌ జిల్లాలోని అన్ని స్థానాలను దక్కించుకుని క్లీన్‌ స్వీప్‌ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్‌ తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారని, ఇందుకు ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కారణమని స్పష్టం చేశారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండోసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారని, ఆయన ఆధ్వర్యంలో మరోసారి ప్రభుత్వం ఏర్పడబోతోందని చెప్పారు. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టని అంశాలను కూడా అమలు చేసి ప్రజల ఆదరాభిమానాలను కేసీఆర్‌ సొంతం చేసుకున్నారని తెలిపారు. విపక్షాలు ఎన్ని మోసపూరిత ప్రకటనలు చేసినా ప్రజలు నమ్మలేదని, టీఆర్‌ఎస్‌కే ఓటు వేశారని తెలిపారు.

Kadiam Srihari
warangal district

More Telugu News