నయనతారనే కొరటాల ఫిక్స్ చేశాడట!
- చిరూతో కొరటాల శివ మూవీ
- మొదలైన ప్రీ ప్రొడక్షన్ పనులు
- జనవరిలో పూజా కార్యక్రమాలు
ప్రస్తుతం తెలుగు .. తమిళ భాషల్లో అనుష్క .. నయనతార .. త్రిష .. శ్రియ మాత్రమే సీనియర్ కథానాయికలుగా కనిపిస్తున్నారు. వీళ్లందరిలో తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో మంచి క్రేజ్ వున్న కథానాయిక నయనతార మాత్రమే. అందుకనే 'సైరా' కోసం ఆమెనే తీసుకున్నారు. కొరటాల సినిమా విషయంలోను కథానాయిక సమస్య తలెత్తింది. పాత్ర పరంగాను .. తన క్రేజ్ కి తగిన జోడీగాను నయనతార అయితేనే బాగుంటుందని చిరంజీవి అనడంతో, ఆమెనే కొరటాల ఖరారు చేశారని చెప్పుకుంటున్నారు.