bihar: గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ హక్ మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ!

  • బిహార్ కాంగ్రెస్ నేత అస్రావుల్ హక్ కన్నుమూత
  • కిషన్ గంజ్ లో ఎ.ఎం.యూ సెంటర్ ఏర్పాటులో కీలకపాత్ర
  • సంతాపం తెలిపిన పార్టీ నేతలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు మౌలానా అస్రావుల్ హక్ ఖాస్మి (77) కన్నుమూశారు. బిహార్ లోని కిషన్ గంజ్ లో తన నివాసంలో నిన్న ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కిషన్ గంజ్ లో అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఎ.ఎం.యూ సెంటర్) సెంటర్ ను ఏర్పాటులో ఆయన కీలకంగా వ్యవహరించారు.

కాగా, హక్ మరణంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముస్లింల అభ్యున్నతికి హక్ ఎంతగానో కృషి చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ తెలిపారు. నిస్వార్థపరుడైన ఓ కార్యకర్త, నేత సేవను పార్టీ కోల్పోయిందని వ్యాఖ్యానించారు.  
bihar
Congress
mp
haq
dead
heart attack

More Telugu News