Vijayashanti: జాతీయ సర్వే సంస్థల గురించి మనకు తెలీదా?: విజయశాంతి

  • ఆ సర్వేలను నమ్మాల్సిన పనిలేదు
  • అవన్నీ కాంగ్రెస్‌కు వ్యతిరేకమని  అందరికీ తెలుసు
  • కూటమి విజయం ఖరారు: వీహెచ్
జాతీయ సర్వేలన్నీ టీఆర్ఎస్‌కు అనుకూలంగా రావడంపై కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి స్పందించారు. తెలంగాణ విషయంలో జాతీయ సర్వేలన్నీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉండడం సర్వ సాధారణ విషయమేనన్నారు. జాతీయ సర్వే ఫలితాలను తాము ముందే ఊహించామని, వాటిని నమ్మాల్సిన పనిలేదని తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ..  తెలంగాణలో ప్రజా కూటమి విజయం ఖారారైందన్నారు. పోలింగ్ సరళిని బట్టి ప్రజాఫ్రంట్ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రజాఫ్రంట్ క్లీన్ స్వీప్ చేయబోతోందని జోస్యం చెప్పారు. ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఓటర్లు కూడా ప్రజాఫ్రంట్‌కే మద్దతు పలికారన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానిని కేసీఆర్ అమలు చేయలేదని, అందువల్లే ప్రజలు ప్రజాఫ్రంట్ వైపు మొగ్గు చూపారని వీహెచ్ పేర్కొన్నారు.
Vijayashanti
National media
Telangana
Congress
TRS

More Telugu News