Congress: ఒకవేళ కాంగ్రెస్ ఓడినా గెలిచినట్టే లెక్క: ప్రొఫెసర్ నాగేశ్వర్

  • అసెంబ్లీ రద్దు చేసినప్పుడు టీఆర్ఎస్‌కు అనుకూలం
  • కాంగ్రెస్ అద్బుతంగా పుంజుకుంది
  • చంద్రబాబు ప్రచారంతో కాంగ్రెస్‌కు నష్టం
తన అంచనాలు నిజమై తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడినా విజయం సాధించినట్టేనని ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసినప్పుడు పరిస్థితులు మొత్తం టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని, కాంగ్రెస్ పరిస్థితి అప్పుడు చాలా దీనంగా ఉందని పేర్కొన్నారు.

 కాంగ్రెస్ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చే స్థితికి చేరుకుందని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ ఓడినా.. గెలిచినట్టేనని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.  నిజానికి చంద్రబాబు వల్లే కాంగ్రెస్‌కు కొంత నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణలో ఆయన ప్రచారం వల్ల టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు బీజేపీకి పడి ఉంటాయన్నారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెప్పడం, కేసీఆర్‌ను తిట్టడం వంటి అంశాలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు.
Congress
Telangana
Assembly Elections
Chandrababu
TRS
Nageshwar

More Telugu News