KTR: సిద్ధిపేటలో ఎదురుపడ్డ కేటీఆర్, హరీష్.. ఆసక్తికర వ్యాఖ్యలు !

  • బావ కంగ్రాట్స్.. నీకు లక్ష మెజార్టీ ఖాయం
  • నీ దాంట్లో సగం మెజార్టీ అయినా తెచ్చుకుంటా
  • సిరిసిల్ల పోతున్నా: హరీష్ తో కేటీఆర్ 
సిద్ధిపేటలో అనుకోకుండా కలుసుకున్న హరీశ్ రావు, కేటీఆర్ లు ఇద్దరూ పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ తో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఓటేసిన కేటీఆర్ తన నియోజకవర్గమైన సిరిసిల్లకు బయలుదేరగా, సిద్ధిపేట నియోజకవర్గంలోని గ్రామాల్లో పోలింగ్ సరళిని తెలుసుకుంటూ హరీశ్ రావు పర్యటించారు. ఇదే సమయంలో వీళ్లిద్దరూ గుర్రాల గొంది గ్రామం వద్ద తమ వాహనాల్లో ఎదురుపడ్డారు. వెంటనే, తమ వాహనాలను ఆపి కిందకు దిగి ఆత్మీయంగా పలకరించుకున్నారు.

‘బావ కంగ్రాట్స్.. నీకు లక్ష మెజార్టీ ఖాయం’ అని హరీష్ తో అన్న కేటీఆర్ ‘నీ దాంట్లో సగం మెజార్టీ అయినా తెచ్చుకుంటా.. సిరిసిల్ల పోతున్నా’ అని అనడంతో, కేటీఆర్, హరీష్ లు నవ్వుకుంటూ ఒకరినొకరు ముందస్తుగా అభినందించుకున్నారు.
KTR
harish
siddhipet
gurrala gondi

More Telugu News