rajatkumar: రజత్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేసిన ప్రజాకూటమి నేతలు

  • టీఆర్ఎస్, బీజేపీ అరాచకాలపై ఫిర్యాదు చేశాం
  • వంశీచంద్ పై బీజేపీ దాడి అమానుషం
  • కాంగ్రెస్ నేత కోదండరెడ్డి 
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ను ప్రజాకూటమి నేతలు కలిశారు. కాంగ్రెస్ నేత కోదండరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నేతలు ఆయనను కలిశారు. వీరిలో రావుల, దుర్గాప్రసాద్, కాశీనాథ్, వెంకటరెడ్డి వున్నారు. అనంతరం, మీడియాతో కోదండరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల పోలింగ్ లో టీఆర్ఎస్, బీజేపీ అరాచకాలపై ఫిర్యాదు చేశామని, ప్రజాకూటమి అభ్యర్థి వంశీచంద్ పై బీజేపీ దాడి అమానుషమని ఆరోపించారు.
rajatkumar
mahakutami
t-congress
kodanda reddy

More Telugu News