balu: ఎస్పీ బాలూని అవమానించారంటూ అభిమానుల అసహనం

  • రజనీ హీరోగా రూపొందిన 'పెట్టా'
  • చాలా గ్యాప్ తరువాత రజనీకి పాడిన బాలు
  • సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఫ్యాన్స్
తెలుగు పాటను తేనెలో ముంచి తీసిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఒక్క తెలుగులోనే కాదు అనేక భాషల్లోని పాటలు ఆయన స్వరంలో అమరత్వాన్ని పొందాయి. పాటల్లో కొత్త పోకడలు మొదలయ్యాక బాలసుబ్రహ్మణ్యం చాలా వరకూ పాడటం తగ్గించారు. తమిళనాట రజనీ .. కమల్ సినిమాలు భారీ విజయాలను అందుకోవడంలో బాలసుబ్రహ్మణ్యం పాత్ర ఉందనేది అందరూ అంగీకరించే నిజం.

నిన్నమొన్నటి వరకూ రజనీ సినిమాల్లో బాలూ చేత ఒక్క పాటైనా పాడించేవారు. అలాంటిది తాజాగా 'పెట్టా' సినిమాలో 'మరణ మాస్' సాంగులో కొన్ని లైన్లు మాత్రమే బాలూ చేత పాడించారు. పాట మొత్తం కాకుండా కొన్ని లైన్లు మాత్రమే పాడించడం బాలూని అవమానపరచడమేనని ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'ఈ పాటకి నాతో కొన్ని లైన్లు మాత్రమే పాడించారు .. అయినా చాలాకాలం తరువాత రజనీకి పాడినందుకు సంతోషంగా వుంది' అని బాలూ తన సంస్కారాన్ని చాటుకోవడం విశేషం. 
balu

More Telugu News